![]() |
![]() |

మనం కొన్ని కొన్ని చూసినప్పుడు కొన్ని భావాలు ఆటోమేటిక్ గా మనసులో వచ్చేస్తూ ఉంటాయి...రీసెంట్ గా గీతామాధురి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే.. "మనం డిప్రెషన్ లో ఉన్నపుడు కానీ, బాధపడినప్పుడు కానీ ఎదురు ఎవరు ఉన్నా కూడా వాళ్ళ ద్రుష్టి మన మీద ఉండాలని..మనల్ని వాళ్ళు చూడాలని విపరీతమైన తాపత్రయపడిపోతూ ఉంటాం.. కానీ వేరే మనిషి కోసం పడే ఆ తాపత్రయమే మనకు మన జీవన విధానానికి, మన ఆరోగ్యానికి చెడు చేస్తుంది..అదొక ట్రాప్ అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం...కాబట్టి మనం చివరి శ్వాస విడిచేటప్పుడైనా కానీ జాగ్రత్తగా మనిషిని ఎంచుకోవాలి...మనం మన డిప్రెషన్ హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే జాగ్రత్తగా ఉండాలి.
.webp)
అంటే మనల్ని మోటివేట్ చేసే శత్రువైనా పర్లేదు కానీ మనల్ని నాశనం చేసే మంచి మిత్రుడిని మాత్రం ఎంపిక చేసుకోకూడదు" అని చెప్పింది." అలాగే ఈ మధ్య కాలంలో ఏ పోస్ట్ పెట్టినా అది తమ కోసమే అన్నట్టు అన్వయించేసుకుంటారని భయపడిపోయిన గీతామాధురి ఇలా కూడా పెట్టింది. "ఎవరిని, దేనికి ఉద్దేశించింది కాదు..కొన్ని సోషల్ గ్యాదరింగ్స్ ని చూసినప్పుడు వచ్చిన ఆలోచన మాత్రమే" అంటూ రాండమ్ థాట్స్ హ్యాష్ టాగ్ ని జత చేసింది. ఇక నెటిజన్స్ ఐతే గీత చెప్పిన ఈ ఉపదేశాన్ని నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ అభినందిస్తున్నారు.
![]() |
![]() |